ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటర్లకు అదృష్టానిచ్చింది

by Disha Web Desk 22 |
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటర్లకు అదృష్టానిచ్చింది
X

దిశ, మక్తల్: మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటర్లకు అదృష్టాన్ని తెచ్చింది. ఒక్క ఓటుకు లక్షల నోట్లు కురిపించాయి. కలిసి ఇచ్చిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త వాహనాలు, ట్రాక్టర్లు, కార్లు, మహిళా ఓటర్లకు బంగారు నగలకు లక్షల రూపాయలు సమకూరాయని ఎమ్మెల్సీ ఓటు కలిగిన వారు సంతోషంతో తబ్బిఉబ్బిపోతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఉప ఎన్నిక కారణంగా ఓటుకు విలువ కట్టడంతో తమ పార్టీ అధిష్టానంకు తెలియకుండా తమకు డబ్బులు ఇవ్వాలని అలా ఇస్తేనే ఓటేస్తామని మధ్యవర్తులతో వ్యవహారం కొనసాగించారని సమాచారం.

మక్తల్ నియోజకవర్గంలోని ఓ జాతీయ పార్టీ ఎంపీటీసీ పార్టీ అధిష్టానంకు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ఎమ్మెల్సీ పరిధిలో జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్సీ ఓట్లు దాదాపు 160 మంది ఉన్నాయని. ఇతర పార్టీలో అసమ్మతిగా ఉన్న ఎమ్మెల్సీ ఓటర్లను తనకు అనుకూలంగా మార్చుకుని తను గట్టి పోటీ ఇస్తా అదృష్టం కలిసొస్తే ఎమ్మేల్సీగా విజయం సాధిస్తానని ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇందుకు రెండు జాతీయ పార్టీలోని వీరి బంధు నాయకుల అభయహస్తం అండదండలతో ప్రచారం చేయడంతో జరిగింది. జాతీయ పార్టీ హోదా కలిగిన వ్యక్తి జోక్యం చేసుకుని పోటీ నుంచి నామినేషన్ ఉప సంహరించడానికి మధ్యవర్తి చేసి దాదాపు రూ. 25 లక్షల వరకు ముట్ట చెప్పినట్లు సమాచారం. దానితో పాటు వారి ఇంట్లో ఉన్న మూడు ఓట్లకు అదనంగా దాదాపు పాతిక లక్షలు అందేలా మధ్యవర్తిత్వం నేర్పడం జరిగిందని ప్రచారంలో ఉంది. ఈ లబ్ధి చేకూర్చినందుకు త్వరలో జరగబోయే ఎంపీ ఎలక్షన్‌లో తనకు అన్ని రకాలుగా సహాయ సహకారం ఉంటుందన్న ఆలోచననే అని ప్రజలు అనుకుంటున్నారు.

అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వల్ల మక్తల్ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థుల నుంచి దాదాపు ఒక్కొక్క ఓటరు రూ. 10 లక్షల లబ్ధి పొందినట్లు సమాచారం. ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలిచి నాలుగున్నర సంవత్సరాలు గడిచిన తమ పరిధిలో అభివృద్ధి పనులు లేక చేసిన అరకోర బిల్లులు ఆదాయం రాక తమ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన నగదు రాబట్టుకోలేక ఉన్న సమయంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేసవి కాలంలో ఉషస్సుల అయింది. నా ఓటు మీకే అంటు ఇద్దరు ఎమ్మేల్సి అభ్యర్థులతో మద్యవర్తిత్వం జరిపి డబ్బులు తీసుకున్నారు ఇలా కలిసి వచ్చిన డబ్బుతో కొందరు మగవారు ట్రాక్టర్లను, కార్లను కొత్త వాహనాలపై ఉరేగుతున్నారు. మహిళలు బంగారు నగలు ధరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.


Next Story