తెలంగాణ వ్యవసాయం భారతదేశానికే తలమానికం: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
తెలంగాణ వ్యవసాయం భారతదేశానికే తలమానికం: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, కొత్తకోట: తెలంగాణ వ్యవసాయం భారతదేశానికే తలమానికమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సతీమణి ఆల మంజుల ఆధ్వర్యంలో బీపీఆర్ గార్డెన్ లో ఏర్పాటుచేసిన కొత్తకోట మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజనాల కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ లో వ్యవసాయం అంతంత మాత్రంగానేనని, గుజరాత్ రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తోందని అన్నారు.

చిన్న రాష్ట్రం అయినా తెలంగాణలో నాలుగు కోట్ల జనాభా, కోటి 50 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, 30 లక్షల మోటార్లకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మనకన్నా పెద్ద రాష్ట్రమని కేవలం 5 లక్షల మోటర్లు ఉన్నావని వాటికి కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదని అన్నారు. మనమంతా ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని మూడోసారి కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్ రెడ్డిని ఎన్నుకోవాల్సిందిగా మంత్రి కోరారు.

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో అన్ని వర్గాలకు అభివృద్ధి జరిగిందని తాగునీటికి, సాగునీటికి, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, కొట్టం వంశీధర్ రెడ్డి, గాడిల ప్రశాంత్, సాకబాల నారాయణ, పద్మ అయ్యన్న, జయమ్మ, సంధ్య రవీందర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, కొండారెడ్డి, ఎరుకలి తిరుపతయ్య, రామ్మోహన్ రెడ్డి, భీమ్ రెడ్డి, షేక్ వహీద్, అమ్మపల్లి బాలకృష్ణ, కటిక శీను తదితరులు పాల్గొన్నారు.

Next Story