సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ..

by Disha Web Desk 11 |
సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ..
X

దిశ, మహబూబ్ నగర్: నకిలీ విత్తనాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్పీ కె.నరసింహ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ తో కలిసి భూత్పూర్ మండల పరిధిలోని సీడ్స్ ప్రొసెసింగ్ యూనిట్ ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టాక్ పాయింట్లు, కంపెనీ మెయింటెన్ చేస్తున్న వివిధ రకాల స్టాక్ రిజిస్టర్స్, లైసెన్స్ రిజిస్టర్, ప్రెమిసెస్ ఆఫ్ లైసెన్స్ రిజిస్టర్, ప్యాకింగ్ లేబుల్స్, బల్క్ స్టాక్ రిజిస్టర్, ట్రాన్సఫర్ సర్టిఫికెట్, డెలివరీ చలాన్స్, ప్రాసెసింగ్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు.

స్టాక్ పాయింట్ లోని విత్తనాలను సాంపిల్స్ తీసుకొని అగ్రికల్చర్ ల్యాబ్ కు పంపించారు. ప్రజలు నకిలీ విత్తనాలను కొని మోసపోవద్ధని, అప్రమతంగా ఉండి నకిలీ పత్తి విత్తనాలను అమ్మేవారి సమాచారాన్ని పోలీసులకు, వ్యవసాయ అధికారులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, వ్యవసాయ శాఖ ఏడి యశ్వంత్, వ్యవసాయ శాఖా ఏఓ మురళి, భూత్పూర్ సీఐ రంజిత్ రెడ్డి, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.


Next Story