Barrelakka : బర్రెలక్కకు ఉపశమనం.!

by Kalyani |
Barrelakka : బర్రెలక్కకు ఉపశమనం.!
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్ : హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు, పీజీలు చదివినా పట్టాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు అంటూ 2021 నవంబర్ 5న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కర్నె శిరీష (బర్రెలక్క). గత ఏడాది డిసెంబర్ 27న నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పోలీసులు ఐపిసీ 505(2) కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం అట్టి కేసు విచారణపై హైకోర్టు స్టే విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు హైకోర్టు న్యాయవాది రామేశ్వరరావు నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఇకనుండి తాను తరచూ కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనిలేదని న్యాయస్థానం తెలిపినట్లు పేర్కొన్నారు. కాగా నిరుద్యోగుల పక్షాన చేసిన వీడియో బర్రెలక్కకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టగా ప్రస్తుతం ఈ తీర్పు ఉపశమనం లభించింది.

Next Story

Most Viewed