ఇక సమరమే..! ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారు

by Disha Web Desk 1 |
ఇక సమరమే..! ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారు
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం జోరు అందుకుంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పేర్లు ఖరారు కాగా.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ ప్రవీణ్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ పేర్లు ఇప్పటికే ఖరారయిన విషయం పాఠకులకు విదితమే.. కాగా, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఊహించిన వారే అభ్యర్థులుగా ఉండగా.. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉండడం నియోజకవర్గ ప్రజలను, రాజకీయ వర్గాలను ఒచింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో ప్రసారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

చెమటోడుస్తున్న అభ్యర్థులు..

పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గత ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులే మళ్లీ పోటీపడుతూ గత ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా వ్యూహాలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి రెడ్డి ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పాదయాత్రలు నిర్వహించి.. సభలు సమావేశాలతో ప్రజలకు చేరువయ్యారు. దీనికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండడంతో పాటు ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులకు ఎప్పటికీ అప్పుడు అలర్ట్ చేస్తున్నారు.

ప్రతి అవకాశాన్ని వినియోగపరచుకోవాలని సూచిస్తున్నారు. ఎన్నికల సమయానికి మరింత పట్టుదలగా పనిచేసే అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కాగా భారతీయ జనతా పార్టీ డీకే అరుణను ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆమె తన రాజకీయ అనుభవాన్ని కూడగట్టుకుని ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో ఉన్నారు. ఇప్పటివరకు చెప్పుకోదగిన స్థాయిలో ప్రచారం చేపట్టలేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. ఎంపీ మన్నె శ్రీనివాస్ సమావేశాలు అవుతున్నారు.

కందనూలులో ఊపందుకుంటున్న ప్రచారం

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి భారత్ ప్రసాద్ ప్రచారంలో ముందున్నారు. ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభను నిర్వహించడంతోపాటు.. ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్య నాయకులు, కార్యకర్తలను కలిసి తన విజయానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా భారీ ఎత్తున సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మల్లురవిని పార్టీ అధిష్టానం ఇటీవల అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడిప్పుడే ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు . వివిధ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆయ నను కలిసి పార్టీలో చేరుతున్నారు. మొత్తంపై అభ్యర్థులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు.


Next Story

Most Viewed