విద్యార్థిని నికిత మృతి సంఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ రాములు

by Dishanational1 |
విద్యార్థిని నికిత మృతి సంఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ రాములు
X

దిశ, అచ్చంపేట: మన్ననూరు గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో అనుమానాస్పదంగా మృతిచెందిన నికిత కుటుంబాన్ని గురువారం ఎంపీ రాములు కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎంపీ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ విద్యార్థి మృతి చాలా విషాదకరమని, ఈ సంఘటనకు సంబంధించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా మరింత సహాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తానని కుటుంబానికి భరోసా కల్పించారు. తనతోపాటు ఎంపీ తనయుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.

ప్రిన్సిపాల్ పై వేటు..

గురుకుల బాలికల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతిచెందిన నికిత సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ బాధ నుండి బాధిత తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులు తేరికోకముందే పాఠశాల ప్రిన్సిపాల్ లలిత కుమారి మృతిచెందిన విద్యార్థిపై ప్రేమ వ్యవహారం దాగి ఉందని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో పాఠశాల ముందు మరోసారి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రిన్సిపాల్ లలిత కుమారిపై సస్పెన్షన్ వేటు వేశామని ఆర్డీఓ పాండు నాయక్ కుటుంబ సభ్యులకు, నిరసన వ్యక్తం చేస్తున్న వారికి వివరించి చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.

పోలీసులు ఆర్థిక సాయం..

పై బాధిత కుటుంబానికి అచ్చంపేట డీఎస్పీ కృష్ణ కిషోర్ మానవతా దృక్పథంతో స్పందిస్తూ ఆ కుటుంబానికి పోలీస్ శాఖ తరపున రూ. 50 వేల ఆర్థిక సాయం బుధవారం అందజేశారు. పోలీసులు చేసిన సహాయాన్ని మండల ప్రజలు అభినందిస్తున్నారు.

Next Story

Most Viewed