కడుపుమండిన రైతన్న.. డీజిల్ పోసి వడ్ల కుప్ప కాల్చివేత యత్నం..

by Aamani |
కడుపుమండిన రైతన్న.. డీజిల్ పోసి వడ్ల కుప్ప కాల్చివేత యత్నం..
X

దిశ, జగిత్యాల రూరల్ : ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోలులో జాప్యం కావడం తో కడుపు మండిన యువ రైతు తన ధాన్యాన్ని డీజిల్ పోసి కాల్చి చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఘటన ఆదివారం రోజున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జగిత్యాల రూరల్ మండలం గోపాల్ రావుపేట ఐ కే పి కేంద్రంలో సందీప్ అనే యువ రైతు గత నెల 22న ధాన్యాన్ని పోయాగ ఇప్పటికీ నెల రోజులు గడిచిన తూకం వేయలేదని రాబోవు రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో కడుపు మండిన సందీప్ తన వెంట తెచ్చుకున్న డీజిల్ ను వడ్ల కుప్ప మీద పోసి కాల్చి వేసే ప్రయత్నం చేయగా తోటి రైతులు ఆపడం తో తన నిరసన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed