డైనమిక్ ఎడిషన్‌లతో 'దిశపత్రిక' విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

by Web Desk |
డైనమిక్ ఎడిషన్‌లతో దిశపత్రిక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
X

దిశ, జడ్చర్ల: డిజిటల్ రంగప్రవేశం చేసిన దిశ పత్రిక, పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది అయిందని, ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కథనాలను అందిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. డైనమిక్ ఎడిషన్‌లతో మిగతా పత్రికలకు దీటుగా విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిందని కొనియాడారు. పురుడుపోసుకున్న 20 నెలలోపే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికలను వెనక్కినెట్టి మూడో స్థానంలో కొనసాగడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణం పద్మావతి కాలనీలోని పార్క్‌లో 2022 నూతన సంవత్సర దిశ క్యాలెండర్‌ను రాష్ట్ర సంగీత నాట్యమండలి చైర్మెన్ బద్మి శివకుమార్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దిశ పత్రిక బ్యూరో నరసింహులుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని జిల్లా బ్యూరో నరసింహులు, జడ్చర్ల నియోజకవర్గం రిపోర్టర్ నిసార్ అహ్మద్ కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ, సామాజిక కథనాలతో వెలువడుతున్న దిశ పత్రిక పాఠకులను, ప్రజలను ఆలోచింపజేస్తుందన్నారు. అనతికాలంలోనే ఉన్నత ప్రమాణాల్లో విజయవంతంగా ముందు కొనసాగుతున్న దిశ పత్రిక యాజమాన్యానికి అందుకు సహకరిస్తున్న దిశ పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దిశ బ్యూరో సభ్యులు నరసింహులు, జడ్చర్ల రిపోర్టర్ నిస్సార్ అహ్మద్, మిడ్జిల్ జెడ్పీటీసీ శశిరేఖ బాలు, జడ్చర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సారిక రామ్మోహన్, టీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, మిడ్జిల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాండు యాదవ్, సర్పంచ్ నిరంజన్, టీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి సత్యం గుప్త, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed