యేసుక్రీస్తు త్యాగనిరతి ప్రజలకు అనుసరణీయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 6 |
యేసుక్రీస్తు త్యాగనిరతి ప్రజలకు అనుసరణీయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ,మహబూబ్ నగర్: సాటి మనిషి కోసం యేసుక్రీస్తు అనుసరించిన త్యాగనిరతి, శత్రువునైనా ప్రేమించాలన్న ఆదర్శాలు ప్రజలందరికీ అనుసరణీయమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం బోయపల్లి రోడ్డులోని కల్వరి కొండ పైనున్న చర్చిలో జరిగిన ఈస్టర్ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. యేసు క్రీస్తు శిలువ మరణాన్ని పొంది మానవాళి పాపాల్ని క్షమించడానికే భూమిపై మళ్లీ అవతరించారని పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం ప్రభువైన యేసు మళ్లీ వచ్చిన రోజు ఇవాళ్టి ఈస్టర్ పర్వదినమని అన్నారు. ప్రేమ,సహనం,శాంతిని పంచిన కరుణామయుడు క్రీస్తు అని, ఆయన ప్రేమస్వరూపుడని పేర్కొన్నారు.

రూపాలు వేరైనా అంతిమంగా భగవంతుడు ఒక్కడేనని, ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు. కల్వరి కొండపై కొత్త నిర్మాణం ఫ్లోరింగ్ ఏర్పాటుతో పాటు గెస్ట్ రూమ్ నిర్మిస్తామని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న క్రిస్టియన్ భవన్ పనులను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సమస్త క్రైస్తవ సోదరులకు ఆయన ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న,కౌన్సిలర్లు జాజి మొగ్గ నర్సింహులు,మోతీలాల్,పాస్టర్ వరప్రసాద్,క్రైస్తవ ప్రముఖులు కో ఆప్షన్ సభ్యులు ప్రభాకర్,డాక్టర్ శామ్యూల్,డేవిడ్,టైటస్ పాల్,బెంజమిన్ తదితర క్రైస్తవులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story