తొలి సర్వ వర్గ సామూహిక భవనం ప్రారంభించిన - మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
తొలి సర్వ వర్గ సామూహిక భవనం ప్రారంభించిన - మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే పరమావధిగా పని చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.గురువారం వనపర్తి జిల్లా,పెద్దమందడి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సర్వ వర్గ సామూహిక కమ్యూనిటీ భవనం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వినూత్న ఆలోచన ప్రతి మండల కేంద్రంలో సర్వ వర్గ సామూహిక కమ్యూనిటీ భవనాలు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి తో పాటుగా సమాజంలో భిన్నత్వంలో ఏకత్వం సాధనే పరమావదిగా పనిచేస్తుందన్నారు.

వనపర్తి నియోజకవర్గం ఏడు మండల కేంద్రాలలో ప్రభుత్వం కుల,మతాలకు అతీతంగా ప్రజలు శుభకార్యాలు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా సర్వ వర్గ సామూహిక భవనాలను నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ఒక్కో భవనానికి 75 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి,జెడ్పిటీసి రఘుపతి రెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వేణు టిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story