ఆర్ అండ్ బీ అధికారులు నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి..

by Disha Web Desk 20 |
ఆర్ అండ్ బీ అధికారులు నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం బలి..
X

దిశ, వడ్డేపల్లి : పెద్ద తాండ్రపాడుకు చెందిన పరమేష్ గౌడ్ గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం రోజు ఉదయం బీజేపీ నాయకులు ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండుప్రాణం బలి అయిపోయిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి రాధా సత్సంగ్ ఆశ్రమం వద్ద రోడ్డుపై పెద్ద పెద్ద గుంతల్ని పూడ్చాలని డిమాండ్ చేశారు. ఇన్నిసంవత్సరాలైనా గుంతలు పూడ్చకపోవడం వల్ల గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద తాండ్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఈడిగ పరమేశ్వర గౌడ్ రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతిచెందాడు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికి ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వహించకుండా రోడ్డు ప్రమాదం జరగకుండా గుంతల్ని పూడ్చాలని, మృతుని కుటుంబానికి 10 లక్షలు రూపాయలు వెంటనే ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు మోహన్ యాదవ్, పట్టణ కో-ఆర్డినేటర్ గురుదత్త అంజి ప్రమాదకర ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రజల ప్రాణాలనుకాపాడాలని అధికారులను డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed