కుండపోత వర్షాలకు 56 మంది మృతి.. నిరాశ్రయులుగా మారిని వేలాదిమంది

by Disha Web Desk 12 |
కుండపోత వర్షాలకు 56 మంది మృతి.. నిరాశ్రయులుగా మారిని వేలాదిమంది
X

దిశ, వెబ్ డెస్క్: కుండపోత వర్షాల కారణంగా 56 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన బ్రెజిల్ దేశంలోని దక్షిణాది రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్‌లో చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి. దీంతో.. రోడ్లు, భవనాలు కూలిపోవడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రకృతి విలయతాండవం వల్ల వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారిపోయారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వరదల కారణంగా భవనాలు కూలిపోవడంతో డజన్ల కొద్దీ ప్రజలు కనబడకుండా పోయారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆ ప్రాంత అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అల్ జజీరా ప్రకారం, రియో ​గ్రాండే దో సుల్ రాష్ట్రంలో నీటి మట్టాలు విపరీతంగా పెరగడం వల్ల ఆనకట్టలు కుంగిపోయాయి.. దీంతో పోర్టో అలెగ్రే మహానగరానికి ముప్పు వాటిల్లుతోందని.. బ్రెజిల్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన విపత్తుగా తాము భావిస్తున్నామని అధికారులు తెలిపారు.

Next Story