చేపల వలలకు చిక్కిన మగర్ క్రోకడైల్..

by Disha Web Desk 20 |
చేపల వలలకు చిక్కిన మగర్ క్రోకడైల్..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ నల్లమలలో పదరా మండలంలో తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మద్దిమడుగు రేంజ్ పరిధిలోని కృష్ణా నదిలో చేపల వలలకు మగర్ క్రోకడైల్ అనే పేరు గల పెద్ద మొసలి చిక్కిందని ఆ తరువాత అది చనిపోయిందని అటవీ క్షేత్ర అధికారి ఆదిత్య శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది సరిహద్దు ప్రాంతంలో చేపలు పట్టేవారి 14 బోటులను శుక్రవారం సీజ్ చేశామన్నారు.

గతంలో అక్కడ ఉంటున్న మత్స్య కారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు చేపలు పట్టరాదని కౌన్సిలింగ్ చేశామన్నారు. అడవిలో చేపలు పట్టోద్దని ఇంతకు ముందు హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎవరి బోటు వలలో చికిందో దర్యాప్తు చేస్తున్నామని, మత్స్య కారులను రావొద్దన్నారు. ఈ విషయం పై నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ (టీఎస్టీఆర్) అధికారులకు కూడా సమాచారం అందజేశామన్నారు. వన్య ప్రాణి చట్టం ప్రకారం కేసు బుక్ చేసి సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు చేస్తున్నామని మద్దిమాడుగు రేంజ్ అధికారి పేర్కొన్నారు.



Next Story

Most Viewed