కార్మిక చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి..

by Disha Web Desk 11 |
కార్మిక చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి..
X

దిశ, వనపర్తి: కార్మిక చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీ రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకోవాలన్నారు.

జిల్లా న్యాయస్థానాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి కార్మికుడు 110 రూపాయలు చెల్లించి గుర్తింపు కార్డును పొందడం ద్వారా కార్మిక శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ సహాయ అధికారి వేణుగోపాల్, పురపాలక సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, న్యాయవాదులు కృష్ణయ్య, ఉత్తరయ్య, పసుపుల తిరుపతయ్య, ఆంజనేయులు, రియాజ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story