బీసీ,మైనారిటీ ప్రజల స్వయం సమృద్ధి కోసమే కేసీఆర్ కృషి - మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీసీ,మైనారిటీ ప్రజల స్వయం సమృద్ధి కోసమే కేసీఆర్ కృషి - మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ,వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బీసీ,మైనారిటీ ప్రజల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు, మైనారిటీ బంధు పథకాలను ప్రవేశపెట్టి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

వనపర్తి జిల్లా పార్టీలోని తొలివిడతలో 54 మందికి రూ. లక్ష చొప్పున మైనారిటీ బంధు పథక చెక్కుల పంపిణీ చేశారు. వీర శైవ లింగాయత్ భవనానికి 10 గుంటల స్థలం కేటాయిస్తూ, సంఘం నేతలకు ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి నిరంజన్ రెడ్డి అందజేసారు.అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి మున్సిపాలిటి పరిధిలోని 1వ వార్డు రాయిగడ్డ,9వ వార్డు విద్యానగర్ లలో రూ.2.26 కోట్లతో నిర్మించే సీసీ రహదారుల నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు.పీర్లగుట్ట డబల్ బెడ్రూం ఇండ్ల వద్ద మిషన్ భగీరధ నీళ్లను విడుదలచేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గ ప్రజలకు అండగా నిలబడాలని,మైనారిటీ అడబిడ్డల పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్ కింద రూ.లక్ష 116 అందిస్తుందని,ఆసరా ఫించన్లతో అభాగ్యులకు అండగా నిలబడుతుందని అన్నారు.మలివిడతలో 120 మంది మైనారిటీలకు సాయం అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పద్మావతి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు, వీర శైవ లింగాయత్ అధ్యక్షులు భాగ్యరాజ్ , నేతలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed