లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Disha Web Desk 11 |
లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: గ్రామ పంచాయతీల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. స్థానిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో జిల్లాలోని పంచాయతీ సెక్రటరీలకు నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. పంచాయతీ సెక్రటరీలకు గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయలన్నారు.

పనిచేయని వర్కర్లను తొలగించే అధికారం పంచాయతి సెక్రటరీలకు ఉందన్నారు. గ్రామ పంచాయతీలలో ఇంటి పన్ను క్రమం తప్పకుండా వసూలు చేయాలన్నారు. గృహాల నుంచి పొడి, తడి చెత్త సేకరణ చేసి వర్మీకంపోస్ట్ ఎరువు తయారు చేయాలన్నారు. గ్రామాలను సుందరంగా తీర్చి దిద్దవలసిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి అర్హత గల ప్రతీ ఒక్కరికీ, గ్రామాలలోని కూలీలకు జాబ్ కార్డులు అందించాలని, ప్రతీ కూలీకి పని కల్పించి చేసిన పనులకు డబ్బులు చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మయంక్ మిత్తల్, జడ్పీ సీఈఓ జ్యోతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed