తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య పాలన సాగుతది.. భట్టి విక్రమార్క

by Disha Web Desk 20 |
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య పాలన సాగుతది.. భట్టి విక్రమార్క
X

దిశ, అచ్చంపేట : 2014లో రాష్ట్రం ఏర్పాటు కోసం ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమ పోరాటం ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంను గౌరవించి ఆనాటి ఉద్విగ్నంగా ఉన్న పరిస్థితుల్లో ధైర్యం చేసి ఆనాడు టీఎస్ బిల్లు పాస్ ఆఫ్ చేసి రాష్ట్రాన్ని ప్రకటించిన గణత కాంగ్రెస్ దే నని, తెలంగాన ప్రకటించిన సోనియాగాంధీకి కృతజ్ఞతగా తెలంగాణ ప్రజానీకం గౌరవించాల్సి ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్యకర్తలు నాయకులు మధ్యన పీపుల్స్ మార్చి పాదయాత్ర సందర్భంగా కేక్ కట్ చేశారు. శుక్రవారం నాతికి భట్టి పాదయాత్ర 78వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని బల్మూరు మండలం అనంతపురం కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రజలను ఉద్దేశించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఏ ఒక్కలక్ష్యం నెరవేరలేదని ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.

నిరుద్యోగుల ఆశలు ..

కొట్లాడి సాధించుకున్న మనకొలువులు మనకే అని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగ ఆశలు నెరవేరలేదని, ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించి ఖాళీలుగా ఉన్నపోస్టులను భర్తీ చేశాం. ఈ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్న భర్తీచేయకుండా నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం దగా చేస్తుందన్నారు. రైతుబంధు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను అరిగోసపెడుతున్నది క్వింటా ధాన్యం పై 12 కేజీలు తరుగు కొడుతూ రైతులను నిలువున మంచుతున్నది ఈ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో రైతుల అప్పులకు వడ్డీలు పెరిగి ఇర్రేగ్యులర్ అకౌంట్స్ గా మారడానికి కారణం ప్రభుత్వం రైతుల పట్లనిర్లక్ష్య వైఖరన్నారు.

వాగ్దానాలలో విస్మరించడం..

అచ్చంపేట నియోజకవర్గం ఉమామహేశ్వర, చెన్నకేశవ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి విస్మరించడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, 2016లో నీళ్లు ఇస్తామని చెప్పిన మంత్రి హరీష్ రావు 2023 లో కూడా అదే మాట చెప్పడం విడ్డూరంగా ఉందని, బీఆర్ఎస్ పాలనకు ఉన్నదీ ఇక రెండు నెలల సమయమే. ఈ ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేసారు ? నీళ్లు ఎప్పుడిస్తారు ? ఉమామహేశ్వర, చెన్నకేశవ ప్రాజెక్టును పూర్తిచేయడం కాంగ్రెస్తోనే సాధ్యం. అధికారంలోకి రాగానే పై ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. తనతోపాటు పీసీసీ ఉపాధ్యక్షుడు సీనియర్ నేత డాక్టర్ మల్లు రవి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ స్థానిక నాయకులు ఉన్నారు.


Read More 2023 Telangana Legislative Assembly election News
For Latest Government Job Notifications
Follow us on Google News




Next Story

Most Viewed