చరిత్ర రేపటి తరానికి తెలియకుండా పాలకుల కుట్రలు: ప్రొఫెసర్ హరగోపాల్

by Disha Web Desk 11 |
చరిత్ర రేపటి తరానికి తెలియకుండా పాలకుల కుట్రలు: ప్రొఫెసర్ హరగోపాల్
X

దిశ, అచ్చంపేట: చరిత్ర రేపటి తరానికి తెలియకుండా పాలకుల కుట్రలు చేస్తున్న పరిస్థితులు చాలా బాధను కలిగిస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సత్యాలక్ష్మి పంక్షన్ హాల్ లో ‘కాలం మరువని యోధులు’ చెవ్వ రఘుపతి వ్యాసాలు పుస్తకావిష్కరణ సభకు ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య వక్తగా పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్ అధ్యక్షతన సభ జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటి పరిస్థితులలో రచయిత రఘుపతి ‘కాలం మరువని యోధులు’ అనే పుస్తకంలో రాసిన 12 వ్యాసాలు ఆనాటి ఉద్యమ పరిస్థితులు ప్రధానంగా ఆదివాసి, బడుగు బలహీన వర్గాల ఔన్నత్యం నేటి తరానికి కావలసిన చరిత్ర సత్యాలను మరొకసారి వాటి లోతులను అధ్యయనం చేసి రానున్న తరాలకు అందించేసిన ప్రయత్నం చాలా అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు రాఘవాచారి, బైరెడ్డి సతీష్, నారాయణ, గాజుల లక్ష్మీనారాయణ, చెవ్వ పాండు, నాసరయ్య, గోపాల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story