షార్ట్ సర్క్యూట్‌తో డీసీఎంలో తీసుకెళ్తున్న గడ్డి దగ్ధం

by Dishanational2 |
షార్ట్ సర్క్యూట్‌తో డీసీఎంలో తీసుకెళ్తున్న గడ్డి దగ్ధం
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ నుండి ప్రశాంత్ నగర్ గ్రామానికి డీసీఎం వాహనంలో పశుగ్రాసం తీసుకెళుతున్న వరిగడ్డి ప్రమాదవశాత్తు రోడ్డుకు సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫైర్ ఇంజన్లో సగం నీరు ఉండడం వల్ల మంటలను పూర్తిస్థాయిలో ఆర్పడంలో మరింత ఆలస్యం అయ్యింది.

మన్ననూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ను తీసుకొచ్చన నేపథ్యంలో ఫైర్ ఇంజన్ వారి వద్ద ఉన్న ఆయిల్ ఇంజన్ మోటర్ ఆన్ చేసి నీటిని తీసుకునే ప్రయత్నం సిబ్బంది చేయగా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుమారు అరగంటకు పైగా డీసీఎం వాహనంలో మిగిలిన వరిగడ్డి కాలుతూనే ఉన్నది. వాహనానికి ప్రమాదం జరగకుండా ఉండేందుకు స్థానికులు చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు అష్ట కష్టాలు పడి డీసీఎం వాహనంలో ఉన్న వరిగడ్డి ని పూర్తిగా మంటలు ఆర్పే విధంగా ఫైర్ సిబ్బంది కృషి చేశారు. ఫైర్ ఇంజన్ వాహనంలో అసంపూర్తిగా నీరు ఉండడం ఏంటని పెద్ద ప్రమాదం జరిగితే నివారించడం ఎలా అని స్థానికులు చర్చించుకున్నారు. ఈ ప్రమాదం వలన నల్గొండ జిల్లా మల్లెపల్లి నుండి వరిగడ్డిని తీసుకువచ్చిన రైతుకు రూ.40 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని డిసిఎం వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.


Next Story