త్రుటిలో తప్పిన ప్రమాదం.. రైలు నుంచి విడిపోయిన బోగీలు..

by Disha Web Desk 20 |
త్రుటిలో తప్పిన ప్రమాదం.. రైలు నుంచి విడిపోయిన బోగీలు..
X

దిశ, జడ్చర్ల : గూడ్స్ రైలు నడుస్తుండగానే బోగీలు మధ్యలో విడిపోయి ఇంజన్ ముందుకు వెళ్లిన ఘటన శుక్రవారం జడ్చర్ల రైల్వే స్టేషన్ లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే జడ్చర్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ మీదుగా డోన్ వెళ్తున్న గూడ్స్ ట్రైన్ జడ్చర్ల రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ 2 మీదికి రాగానే ట్రైన్ బోగీలు రెండుగా విడిపోయాయి. దీంతో రైలు ఇంజన్ కొన్ని భోగిలతో ముందుకు వెళ్లిపోయింది. జడ్చర్ల రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు ట్రైన్ రెండుగా విడిపోయిన ఘటనను చూసి నివ్వెర పోయారు. ట్రైన్ రెండుగా విడిపోయింది అంటూ ప్రయాణికులు కేకలు వేశారు. ట్రైన్ బోగీలు విడిపోయిన విషయాన్ని గమనించిన గూడ్స్ ట్రైన్ పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ట్రైన్ ఇంజన్ ను నిలిపేశారు. దీంతో సుమారు 300 మీటర్ల ముందుకు వెళ్లి ట్రైన్ ఆగిపోయింది.

వెంటనే ట్రైన్ రివర్స్లో రప్పించి సుమారు అరగంట పాటు శ్రమించి విడిపోయిన బోగీలను మరమ్మతులు చేపట్టి ట్రైన్ ఇంజన్ తో జతచేయడంతో ట్రైన్ బయలుదేరి వెళ్లిపోయింది. ఈ ఘటన పై జడ్చర్ల రైల్వే స్టేషన్ మాస్టర్ శంకర్ ను వివరణ కోరగా హైదరాబాద్ నుండి డోన్ వెళ్తున్న గూడ్స్ రైలు జడ్చర్ల రైల్వే స్టేషన్ లోకి రాగానే బోగీలు విడిపోయిన విషయం వాస్తవమేనని, ట్రైన్ బ్రేకులు వేసే సమయంలో భోగిలకు ఉన్న క్లిప్పులు లూస్ అయి విడిపోవడం సర్వసాధారణమని తెలిపారు. అలా భోగిలు వేరు అయిన సమయంలో ఎమర్జెన్సీ బ్రేకులు పడతాయని ఇలాంటి ఘటనలతో భయపడాల్సిన పని లేదని జడ్చర్ల రైల్వే స్టేషన్ మాస్టర్ శంకర్ తెలిపారు. ఇక ఈ ఘటన జడ్చర్ల రైల్వే స్టేషన్లో జరగడంతో సరిపోయిందని అదే అడవిలో నిర్మాణష్య ప్రదేశంలో జరిగి ఉంటే ఆ సమయంలో అదే ట్రాక్ పై వేరే ట్రైన్లు వచ్చి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు, పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed