- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఎమ్మార్పీఎస్ పాదయాత్రకు ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి సంఘీభావం..
దిశ, జడ్చర్ల: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలంటూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగల మహా సంగ్రామ పాదయాత్రకు జడ్చర్ల ఎమ్మెల్యే డా. సి.లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదిన అలంపూర్ నుంచి మొదలైన మాదిగల సంగ్రామ పాదయాత్ర శుక్రవారం జడ్చర్లకు మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిగ్నల్ గడ్డపై గల అంబేద్కర్ విగ్రహానికి స్థానిక జడ్పీటీసీ, జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్యతో కలిసి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సాగిన ఎమ్మార్పీఎస్ ర్యాలీలో పాల్గొన్నారు.
అంతకు ముందు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రమొని యాదగిరి మాదిగ మాట్లాడుతూ.. ఈ మాదిగల సంగ్రామ పాదయాత్ర వచ్చేనెల 3వ తేదీ వరకు శంషాబాద్ చేరుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ రాజు మాదిగ, కో కన్వీనర్ వినోద్ మాదిగ, సీనియర్ నాయకులు దగ్గుల బాల రాజు మాదిగ, మిడ్జిల్ మండల కన్వీనర్ సురేష్ కుమార్ మాదిగ, రాజాపూర్ మండల అధ్యక్షులు నరిగె యాదయ్య మాదిగ, పెరుమాళ్ల జంగయ్య మాదిగ, దగ్గుల నాగేష్ మాదిగ, చెన్నకేశవులు మాదిగ, కుర్మయ్యమాదిగ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొంగలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.