లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

by Disha Web Desk 11 |
లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో నమోదు  చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: గొర్రెల పంపిణీ లబ్దిదారుల వివరాలను ఆన్ లైన్ లో ఈ నెలాఖరులోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో పశు వైద్య అధికారులతో గొర్రెల పెంపకం, పాల ఉత్పత్తి తదితర అంశాలపై సమావేశం నిర్వహించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలి విడత గొర్రెల పెంపకం కార్యక్రమం క్రింద అర్హత కలిగిన 10,817 మందికి గాను ఇప్పటి వరకు 5,724 మంది లబ్దిదారులు తమ వాటా చెల్లించడం జరిగిందని, లబ్దిదారుల వివరాలు ధృవ పత్రాలను సేకరించాలన్నారు.

ప్రతీ లబ్దిదారుని బ్యాంక్ ఖాతా, కులం, ఆధార్ తదితర పత్రాలను తీసుకోవాలని సూచించారు. అప్లోడ్ చేయడానికి అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్ లను నియమించుకోవాలని సూచించారు. జిల్లాలో పాల ఉత్పత్తి పెంపొందించడానికి రైతులకు అదనపు ఆదాయ మార్గాలకు పాడి పరిశ్రమ పై అవగాహన కల్పించాలన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేలా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.



Next Story

Most Viewed