కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ వెంటనే పంపిణీ చేయండి -జిల్లా కలెక్టర్ రవి నాయక్

by Disha Web Desk 11 |
కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ వెంటనే పంపిణీ చేయండి -జిల్లా కలెక్టర్ రవి నాయక్
X

దిశ,మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంగళవారం నుంచి ప్రారంభించిన కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 6 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ ఆదేశించారు.మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి తహసిల్దార్లు,ఎంపీడీవోలు,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి,జిల్లా విద్యాశాఖ అధికారి,మున్సిపల్ కమిషనర్లతో కేటీఆర్ స్పోర్ట్స్ కిట్స్,బతుకమ్మ చీరల పంపిణీ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.తక్షణమే సంబంధిత శాసన సభ్యుల సమయం తీసుకుని 6 తేదీ లోగా వారి నియోజకవర్గాలలోని మండలాలకు వచ్చిన అన్ని స్పోర్ట్స్ కిట్లను ను పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.

అలాగే 3 లక్షల బతుకమ్మ చీరలు గాను,2 లక్షల 68 వేల చీరలు వచ్చాయని,వాటన్నింటిని నియోజకవర్గాల పాయింట్లకు,మండలాలకు పంపించడం జరిగిందని,రేపటి నుండే ప్రారంభం చేసి రెండు మూడు రోజుల్లో పంపిణీని పూర్తిచేసి,ఏరోజుకారోజు పంపిణీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు.త్వరలో ప్రారంభం కానున్న 'అల్పాహారం'పథకంకు సంబంధించి ప్రతి మండలానికి ఒక పాఠశాలను గుర్తించి మన ఊరు-మన బడి పనులు పూర్తయి,డైనింగ్ హాలు,తాగునీరు,అన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి సంబంధిత శాసనసభ్యుల సమ్మతి తీసుకొని కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గృహలక్ష్మి పథకంపై కలెక్టర్ సమీక్షించారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్,డిఆర్డీఓ యాదయ్య,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు,జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్,గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్,మున్సిపల్ కమిషనర్లుతహసీల్దారులు,ఎంపీడీవోలు ఈ వీడియో కాన్ఫెరెన్సు కు హాజరయ్యారు.



Next Story

Most Viewed