కాంగ్రెస్,బీజేపీ రెండు ఒకటే..వారికి ఓటేస్తే ఆగమే : మన్నె శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 11 |
కాంగ్రెస్,బీజేపీ రెండు ఒకటే..వారికి ఓటేస్తే ఆగమే :  మన్నె శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మిడ్జిల్ : కాంగ్రెస్,బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని,ఆ పార్టీలకు ఓటు వేస్తే ఆగమేనని, అమీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎంపీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మహబూబ్నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్ లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన మిడ్జిల్ ఉరుకొండ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజాపాలనను విస్మరించిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేసిందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వారంలో ఇవ్వాల్సిన రైతుబంధు నిధులు ఇప్పటికీ ఇవ్వలేదు, 15 వేల రూపాయల కౌలు రైతులకు ఇస్తానని ఇవ్వలేదు ఇలా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్ మళ్ళీ నమ్మి ప్రజలు మోసపోవద్దని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త మండలాలు, నియోజకవర్గాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు.

అలాగే ఎన్నికల సమయంలో ప్రజలను ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే నష్టపోయిన రైతులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కసారి అయిన కలిసి వారికి మద్దతు తెలిపారా..ఎండిపోయిన పంటలను పరిశీలించారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని వర్గాలకు అభివృద్ధి చేసారని అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడగల్ యాదయ్య, ఎంపీపీ బరిగెల సుదర్శన్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మిడ్జిల్ మండల పార్టీ అధ్యక్షుడు పాండు, ఉర్కొండ మండల అధ్యక్షుడు వీరారెడ్డి, జిల్లా నాయకులు సుధా బాల్ రెడ్డి, బాలు, జంగారెడ్డి , ఎల్లయ్య యాదవ్ ,శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ అరుణ్ రెడ్డి, ఎంపిటిసి గోపాల్ గుప్తా, నాయకులు నవీన్ చారి, భీమ్ రాజ్. బంగారు మేకల శ్రీనివాసులు, నిరంజన్, వెంకట్ సాగర్, సుకుమార్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed