ప్రజా సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయం : ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి

by Disha Web Desk 11 |
ప్రజా సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయం : ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి
X

దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు, సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిలో 5 నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. తాను మా మేనత్త అరుణకు మద్దతు వస్తుందేమోనని అనుకుంటూ ఉండొచ్చని, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని,'వేరే పార్టీకి ఎలా మద్దతు ఇస్తానో ఒకసారి ఆలోచించాలన్నారు.

ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఉమ్మడి జిల్లాలో రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు కాలేదని ఆమె తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు, ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలైతే తమ పరిస్థితి ఏమిటని ఇతర పార్టీలకు భయం పట్టుకుందని ఆమె అన్నారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జడ్పీ చైర్మెన్లు స్వర్ణ సుధాకర్ రెడ్డి, సరిత, వనజ, వంశీచంద్ రెడ్డి సతీమణి ఆశ్లేష రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, సీజే బెనహర్ లక్ష్మణ్ యాదవ్, రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed