కుక్కలతో ఆడుకుంటే ఎఫెక్ట్ అవుతున్న బ్రెయిన్.. పరిశోధనలో విస్తుపోయే నిజాలు

by Dishafeatures3 |
కుక్కలతో ఆడుకుంటే ఎఫెక్ట్ అవుతున్న బ్రెయిన్.. పరిశోధనలో విస్తుపోయే నిజాలు
X

దిశ, ఫీచర్స్: మన జీవితాలు బిజీ బిజీ అంటూ గజి బిజిగా, గందరగోళంగా తయారవుతున్నాయి. ప్రశాంతత లేకుండానే లైఫ్ అలా సాగిపోతూ ఉంది. అయితే కుక్కలతో ఫ్రెండ్ షిప్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇస్తుందని.. పీస్ ను అందిస్తుందని తాజా అధ్యయనం తెలిపింది. డాగ్స్ తో ఆడుకోవడం వల్ల బ్రెయిన్ వేవ్స్ బలంగా మారి.. మనకు రిలాక్స్ గా ఉంటుందని వివరించింది. ఎనర్జీ, పాజిటివ్ ఎమోషన్స్, జ్ఞాపక శక్తి పెరుగుతుందని కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు.

28 ఏళ్ల వయసున్న 30 మందిపై జరిపిన అధ్యయనంలో కుక్కతో ఆడుకోవడం, ఫుడ్ పెట్టడం, మసాజ్, డ్రెస్ చేయడం, ఫొటో తీయడం, కౌగిలించుకోవడం చేశాక వారి బ్రెయిన్ యాక్టివిటీ ఎలా ఉందని గుర్తించారు సైంటిస్టులు. ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ పరీక్షలను (EEGలు) ఉపయోగించి మెదడు తరంగాలను పర్యవేక్షించారు. వాటితో ఆడుకోవడం, నడవడం వల్ల బ్రెయిన్లో ఆల్ఫా-బ్యాండ్ డోలనాల పెరుగుదలను గుర్తించారు. ఈ డోలనాలు సాధారణంగా ప్రశాంతత, విశ్రాంతిని సూచిస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గడంతో సంబంధం కలిగి ఉంటాయి. అంతేకాదు వాటికి జుట్టు కట్ చేసి రెడీ చేయడం, ఆడుకోవడం, మసాజ్ చేయడం ద్వారా బీటా బ్యాండ్ డోలనాలు పెరగ్గా.. ఇవి అటెన్షన్, కాన్సంట్రేషన్ ను ఇండికేట్ చేస్తాయి.

Read More...

Viral video: పక్కనే ఉండి కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు..

Next Story

Most Viewed