అనుమతులు లేకుండా బిజినెస్ తరగతులు.. పోలీసుల అదుపులో నిర్వహకులు

by Disha Web Desk 20 |
అనుమతులు లేకుండా బిజినెస్ తరగతులు.. పోలీసుల అదుపులో నిర్వహకులు
X

దిశ, గద్వాల : ఆన్లైన్ బిజినెస్ లు నమ్మవద్దు అంటూ అధికారులు ఇటు పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నా కొందరు యువత పెడచెవిన పెడుతున్నారు. గొలుసుకట్టు బిజినెస్ లతో ఎంతోమంది మోసపోయి ముక్కున వేలేసుకున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్ట్ సెంటర్ పేరుతో సుమారు 200 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువతీయువకులను ఒకచోట చేర్చి శిక్షణ ఇస్తున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అనుమతులు లేకుండా శిక్షణ ఇస్తున్నట్టు బయటపడింది. ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్ట్ సెంటర్ పేరుతో ఇతర రాష్ట్రాల నుండి సుమారు 200 మంది యువతియువకులకు బిజినెస్ పేరుతో 4 రోజులు ట్రైనింగ్ ఇస్తూ ఒక్కొక్కరితో రూ.7200 తీసుకుంటున్నట్లు సమాచారం. శిక్షణ పూర్తయిన తర్వాత రూ. 32,000 తీసుకొని దుస్తుల రూపంలో ప్రోడక్ట్ ను ఇస్తున్నట్లు సమాచారం.

ఇలా లక్షల రూపాయలు వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు నిర్వాహకులను ప్రశ్నించడంతో కంపెనీ పేరుతో ఉన్న సర్టిఫికెట్లను చూయించారు. ఈ శిక్షణకు స్థానికంగా ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గొలుసుకట్టు బిజినెస్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి ఒక్కరూ ఈ శిక్షణలో లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed