ఉత్తమ సేవా పతకాలకు ఎంపికైన ఇద్దరూ హెడ్ కానిస్టేబుళ్లు

by Disha web |
ఉత్తమ సేవా పతకాలకు ఎంపికైన ఇద్దరూ హెడ్ కానిస్టేబుళ్లు
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు ఉత్తమ సేవా పతకాలను అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఏడాది నిర్వహించనున్న వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎం.వెంకటేశ్వర్లు, శంకర్ రెడ్డిలు అందుకోనున్నారు. వెంకటేశ్వర్లు స్వస్థలం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం కంబాలాపూర్ గ్రామం కాగా ఇంతకుముందు వనపర్తి జిల్లాలో పనిచేసి నారాయణపేట జిల్లాకు బదిలీపై వచ్చారు. శంకర్ రెడ్డిది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మద్దెలబీడు గ్రామం కాగా ఈయన మహబూబ్నగర్, గద్వాల జిల్లాలో పనిచేసి నారాయణపేటకు జిల్లాకు వచ్చారు. వీరిద్దరూ గత 25 సంవత్సరాలకు పైగా పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. కాగా ఉత్తమ సేవా పతకాలకు ఎంపికైన సిబ్బందిని ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేసే వారికి పోలీస్ డిపార్ట్ మెంట్ లో గాని సమాజంలో గానీ ఎప్పుడూ గుర్తింపు అనేది తప్పక ఉంటుందని తెలిపారు.


Next Story