పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లితండ్రులు..

by Disha Web Desk 20 |
పసిబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లితండ్రులు..
X

దిశ, అచ్చంపేట : కన్నబిడ్డలను పోషించలేక తల్లిదండ్రులు తమబిడ్డలను ముక్కు పచ్చలారకుండానే అమ్మకాలు చేస్తున్నారన్న విషయం ఒకప్పుడు వినేవాళ్ళం. కానీ అలాంటి సంఘటననే నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఓ గ్రామంలో ఓ గిరిజన కుటుంబం తనకు జన్మించిన మూడు రోజుల ఆడబిడ్డను అమ్మకానికి బేరసారాలు చేసిన విషయం ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామసమీపంలో గల కిష్ట తాండ గ్రామానికి చెందిన ఓ గిరిజన దంపతులకు దత నాలుగు రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జన్మనిచ్చింది. అయితే ఆ కుటుంబానికి అప్పటికే 5 మంది ఆడబిడ్డల సంతానం ఉండగా మరో ఆడబిడ్డ జన్మించడంతో ఆ బిడ్డలను పోషించలేమనే భారంతో మూడు రోజుల పసిబిడ్డను అమ్మేందుకు తల్లిదండ్రులు సిద్ధమైనట్లు తెలిసింది. అమ్మకం చేసేందుకు వారి బంధువు అందుకుగాను గురువారం అచ్చంపేట పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఆ బిడ్డను అమ్మేందుకు ఇద్దరు వ్యక్తులతో బెరసారాలు కుదుర్చుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక ముస్లిం వ్యక్తి రూ. రెండు లక్షలకు ఒప్పందం కూర్చోగా, మరో వ్యక్తి రూ. 2.5 లక్షలకు బిడ్డను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేస్తున్నట్లు సమాచారం.

ఆ ఇద్దరి వాగ్వివాదంతో..

గిరిజన బిడ్డను కొనుగోలు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు నేను ముందుగా ఒప్పందం చేస్తున్నాను అని వాగ్వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం ఇంటలిజెన్సీ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే సీడబ్ల్యుసీ కార్యాలయానికి సమాచారం అందించి. పోలీసులు సీడబ్ల్యుసీ సభ్యులకు సమాచారం అందడంతో ఆ ఇద్దరు వ్యక్తులు తిన్నగా పలాయించారు. ఆ బిడ్డ అమ్మకం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తదుపరి సీడబ్ల్యూసీ సభ్యులు అంగన్వాడీ టీచర్ గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు కృష్ణ తండా గ్రామానికి చేరుకొని ఆ బిడ్డ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేశారు. ఆ బిడ్డ మీకు ఇష్టం లేకపోతే సీడబ్ల్యుసీ కమిటీకి అప్పగించాలని అలా చేయకుండా ఇతర ప్రయత్నాలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆ బిడ్డ తల్లిదండ్రులతో రాతపూర్వకంగా రాయించుకొని అవగాహన కల్పించారు.



Next Story

Most Viewed