తెలంగాణ అన్నింటా అభివృద్ధి.. దేశానికే మార్గదర్శి: మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 11 |
తెలంగాణ అన్నింటా అభివృద్ధి.. దేశానికే మార్గదర్శి: మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, గద్వాల: తెలంగాణ అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించి, భారతదేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రూ. 2 కోట్లతో నిర్మించిన విద్యుత్ శాఖ ఎస్ ఈ కార్యాలయ ప్రారంభానికి గురువారం మంత్రి హాజరయ్యారు. కార్యాలయం ప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా 16 వేల మెగావాట్ల విద్యుత్ వాడటం జరుగుతుందన్నారు.

నిరంతరం విద్యుత్ ఉంటేనే పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఆర్థిక వనరులు ఏర్పడి రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యుత్ వినియోగంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో విద్యుత్ శాఖకు రూ. 32 వేల కోట్లను కేటాయించారని తెలిపారు. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు.

రాబోయే కాలంలో దేశానికి అన్నం పెట్టే శక్తిగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందన్నారు. అంతకుముందు గద్వాల ఎమ్మెల్యే బాలకృష్ణ మోహన్ రెడ్డి, ఢిల్లీ అధికార ప్రతినిధి మందా జగన్నాథం, జడ్పీ చైర్ పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed