లిక్కర్ స్కాం కేసు : ఈడీ కస్టడీకి బుచ్చిబాబు?

by Disha Web Desk 4 |
లిక్కర్ స్కాం కేసు : ఈడీ కస్టడీకి బుచ్చిబాబు?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరికొంత దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు గతంలో ఆడిటర్‌గా పనిచేసిన బుచ్చిబాబును కస్టడీకి అప్పగించాలని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టును కోరింది. ఎంక్వయిరీకి రావాల్సిందిగా గతంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చామని, షెడ్యూలు ప్రకారం మార్చి 9న రావాల్సి ఉన్నదన్నారు. కానీ ఆయన స్పెషల్ రిక్వెస్టు చేయడంతో మార్చి 13 వరకు గడువు ఇచ్చామని, ఆ ప్రకారం హాజరు కావాల్సి ఉన్నదని తెలిపారు.

ఈనెల 15న హాజరు కావాల్సిందిగా మరోసారి బుచ్చిబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఈ స్కామ్‌లో చేతులు మారిన ముడుపుల గురించి మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరపాల్సి ఉన్నదని, ఇందుకు పిళ్ళయ్, బుచ్చిబాబును కలిపి విచారించాలనుకుంటున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిళ్లయ్ కస్టడీ మార్చి 13తో ముగుస్తున్నందున మరో మూడు రోజుల పాటు (మార్చి 15 వరకు) పొడిగించాలని, అప్పుడే ఇద్దరినీ కలిపి జాయింట్‌గా విచారించడం వీలవుతుందని పేర్కొన్నారు. దీనిపై స్పెషల్ కోర్టు నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉన్నది.

Next Story

Most Viewed