అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం.. లైవ్ షోలో ఒప్పేసుకున్న కేటీఆర్

by Disha Web Desk 19 |
అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం.. లైవ్ షోలో ఒప్పేసుకున్న కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఓ టీవీ చానెల్ డిబేట్‌లో మాట్లాడుతూ.. మా సొంత పొరపాట్ల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చకపోవడం కూడా మరొక కారణమని అన్నారు. మా పార్టీని ఓవర్ లోడ్ చేసుకోవడం కూడా తాము చేసిన తప్పేనని ఒప్పుకున్నారు. రైతు బంధు, దళితబంధు, కార్యకర్తల విషయంలో జరిగిన పొరపాట్లను గమనించలేకపోయామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటమి తర్వాత చాలా నియోజకవర్గాల్లో రివ్యూలు చేశామని.. సమాజంలో వచ్చిన మార్పును గమనించలేకపోయమన్నారు. స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయామని.. పరాజయంపై మాకేమి బాధలేదని అన్నారు. పదేళ్లు అధికారం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కింది స్థాయిలో కేడర్ బలంగా ఉందని.. పార్టీ ఎక్కడికిపోదని దీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed