తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించే పండుగ బతుకమ్మ

by Disha Web Desk |
తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించే పండుగ బతుకమ్మ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బతుకమ్మ పండుగ నేటి నుంచి ప్రారంభం అవుతుండటంలో తెలంగాణ ఆడపడుచులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పల్లె జీవితాన్ని, ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండగ బతుకమ్మ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు. మహిళలందరికి బతుకమ్మ రంగుల పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ మహిళలు, సంస్కృతి, ప్రకృతి, ఐక్యతను చాటే పండుగ అని పేర్కొన్నారు.

Also Read : ఎంగిలి పూల బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?



Next Story

Most Viewed