ఎంగిలి పూల బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

by Dishanational2 |
ఎంగిలి పూల బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆడపిల్లలకు ఇష్టమైన పండుగ ఏదైనా ఉందా అంటే అది బతుకమ్మ పండుగే. ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆడబిడ్డలందరూ ఒక చోట చేరి ఆనందంగా ఆడుకుంటారు. ఈ బతుకమ్మ సంబరాలు 11 రోజులు ఉంటాయి. అయితే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. దీనికి ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మహాలయ అమావాస్యరోజు, అంటే భాద్రపదం చివరి రోజు లేదా ఆశ్వయుజ మాసం ముందురోజు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. దీనికి ఒక రోజు ముందే పూలు కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. మరునాడు అవే పూలతో బతుకమ్మను పేరుస్తారు. అందువలన దీనికి ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందంటారు.

Also Read : తెలంగాణ పల్లె జీవితాన్ని ఆవిష్కరించే పండుగ బతుకమ్మ


Next Story