తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
తప్పు ఒప్పుకున్న కేటీఆర్.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక్కొక్క ఇటుక పేర్చి తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేశామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందని చెప్పారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టిందని అన్నారు. తెలంగాణ అస్థిత్వమే కాదని.. ఆస్తులు కూడా సృష్టించారని చెప్పారు. 60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని కొట్టిపారేశారు.

జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ కాంగ్రెస్ శ్వేతపత్రంలో తప్పుడు లెక్కలు చూపారని అన్నారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు అని క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ చేసిన ఖర్చు రూ.1,37,517 కోట్లు అని వెల్లడించారు. అంతేకాదు.. విద్యుత్ రంగంలో రూ.6,87,585 కోట్ల ఆస్తులు కూడా సృష్టించామని చెప్పారు. దేశ రాష్ట్రపతి ముర్ము సొంత ఊరికే మొన్నటివరకు విద్యుత్ సౌకర్యం లేదని గుర్తుచేశారు. కానీ, తెలంగాణలోని ఏ గ్రామంలోనూ కరెంట్ లేకుండా లేదు అని అన్నారు. కాళేశ్వరంలో ఒక్క బరాజ్‌లో చిన్న జరిగిందని.. దానికే మొత్తం ప్యాకేజీనే తప్పుబడుతున్నారని అన్నారు.



Next Story

Most Viewed