కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు పొలిటికల్ ఎంట్రీ.. నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీ?

by Disha Web Desk 2 |
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూతురు పొలిటికల్ ఎంట్రీ.. నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ఏ అంశంపైన అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ పోటీ చేసి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థిపై 50 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి సత్తా చాటారు. ప్రస్తుతం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజకీయ వారసురాలిని రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కూతురు శ్రీనిధిని నల్లగొండ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి. కాగా, ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అనేకమంది ఉవ్విళ్లూరుతున్నారు.

ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన నేతలంతా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉండటంతో నల్లగొండ సీటు హాట్ కేకులాగా మారింది. ఇక్కడినుంచి పోటీ చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎప్పటినుంచో చక్రం తిప్పుతున్న కోమటిరెడ్డి టికెట్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కూతురికి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టారని ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా కోమటిరెడ్డి కుటుంబం నుండి పవన్ అనే వ్యక్తి ధరఖాస్తు చేసుకున్నారు. అంతేగాకుడా నల్గొండ సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘు వీర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం చివరివరకు పోరాటం చేసి.. త్యాగానికి సిద్ధమైన పటేల్ రమేష్ రెడ్డి కూడా ధీమాగా ఉన్నారు. మరి నల్లగొండ టికెట్‌ ఎవరిని వరిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed