శాంతన్ హజారికాతో బ్రేకప్.. రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్‌లో చేసినందుకేనా?

by Disha Web Desk 8 |
శాంతన్ హజారికాతో బ్రేకప్.. రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్‌లో చేసినందుకేనా?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందంతో ఎంతో మందిని మాయ చేస్తుంది ఈ బ్యూటీ. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా ఈ నటి తన బాయ్ ఫ్రెండ్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతన్ హజారికాకు బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.

చాలా రోజులుగా అతనితో రిలేషన్‌లో ఉన్న ఈ బ్యూటీ ఒక్కసారిగా బ్రేక్ చెప్పి, విడిపోయింది. దీంతో వీరి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. త్వరలో వీరు పెళ్లి పీటలెక్కుతారు అనుకుంటే ఇలా జరిగింది ఏంటీ? అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏమిటని తెగ ఆలోచిస్తున్నారు. అయితే వీరు విడిపోయి చాలా రోజులు అవుతున్నట్లు సమాచారం. గత నెలలోనే వీరు, తామిద్దరం కలిసి జీవించలేమని నిర్ణయించుకుని పరస్పర అంగీకారంతో బ్రేకప్ చెప్పుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే శృతి హాసన్ తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి శాంత ఫోటోలు డిలీట్ చేయడంతో వీరు బ్రేకప్ తీసుకున్న వార్తలు తెరపైకి వచ్చాయి.

ఇక ఆ తర్వాత ఇదో వింత ప్రయాణం. ఈ మధ్య నా గురించి, వ్యక్తుల గురించి చాలా తెలుసుకున్నాను, మనం ప్రతి విషయానికి బాధపడాల్సిన అవసరం లేదు అంటూ శృతిహాసన్ పోస్ట్ చేయడంతో వీరు నిజంగానే బ్రేకప్ చెప్పుకున్నారు అనే క్లారిటీ వచ్చింది. అయితే వీరు బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కలిసి శృతి ఇనిమేల్ అనే ఓ స్పెషల్ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. అందులో లోకేష్ తో శృతి రెచ్చిపోయి చేసిన రొమాంటిక్ సీన్స్ వైరల్ అయ్యాయి, కాగా, ఈ విషయంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చివారు బ్రేకప్ చెప్పుకున్నట్లు ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, దీనిపై సరైన క్లారిటీ లేదు.

Next Story

Most Viewed