రాజన్న బిడ్డగా పాలేరులో పోటీ చేస్తా : Y. S. Sharmila

by Disha Web Desk 20 |
రాజన్న బిడ్డగా పాలేరులో పోటీ చేస్తా : Y. S. Sharmila
X

దిశ, కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని కిష్టాపురం, పాలేరు గ్రామంలోని ఐకేపి సెంటర్ వద్ద అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటానని ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కేసీఆర్ గంటలో పదివేల రూపాయలు అందిస్తానని ఇంతవరకు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, రుణమాఫీ లేదు క్రాఫ్ ఇన్సూరెన్స్ లేదు గిట్టుబాటు ధర లేదని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. రాజన్న రాజ్యంలో రైతులకు అనేక రకాల సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్నారని, నేడు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి సబ్సిడీలు ఇవ్వకుండా రైతుబంధు పేరుతో రూ.5వేలు రూపాయలు అందించి, ఇంకో చేతితో రైతుల వద్ద నుండి రూ.30 వేల రూపాయల గుంజుకుంటూ రైతులను ఏడిపించుకుంటున్నారని అన్నారు.

ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి 30 రోజులు కావస్తున్నప్పటికీ కొనుగోలు చేయకపోవడం ఏమిటని ఆమె కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చి నారుగా మొలుస్తున్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం అంటే ఇది ఒక కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 7100 ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామాని చెప్పిన ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 230 ఐకేపి సెంటర్లు తెరుస్తాం అన్నారని ఎన్ని తెరిచారని అందులో 30శాతం కూడా ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతులను ఏడిపించకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతు ఏడ్చినా రాజ్యం ముందుకు పోదని రైతులు పండించిన ధాన్యం కెసిఆర్ ప్రభుత్వం కొనకపోతే రైతుల ఉసూరు తగిలి కేసీఆర్ ప్రభుత్వం పోవడం ఖాయమని శపించారు.

బంధీపోటుల రాష్ట్ర సమితి, దిక్కుమాలిన కేసీఆర్ సర్కార్..

రాష్ట్ర వ్యాప్తంగా 7000 పైచిలుకు వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆమె అన్నారు. ఇది బంది పోటుల రాష్ట్ర సమితి, దిక్కుమాలిన కేసీఆర్ సర్కార్ అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇప్పటివరకు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాలు కూడా అమలు చేయలేదని అంటూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 57 సంవత్సరాలకు పెన్షన్స్ ఇంటికి ఒక ఉద్యోగం , రైతు రుణమాఫీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఘాటుగా విమర్శలు గుప్పించారు.

భావోద్వేగానికి గురైన గిరిజన రైతు..

భావోద్వేగానికి గురైన స్థానిక గిరిజన రైతు షర్మిలతో మాట్లాడుతూ తాను నాలుగు ఎకరాల రైతునని గత కొన్నెండ్లుగా పాస్ పుస్తకం కోసం తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎవరు పట్టించుకోవడంలేదని వాపోయారు. జిరాక్స్ కాపీలు తీపించి తీపించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని తన ఆవేదన వెళ్ళబుచ్చాడు. అందువలనే తనకు రైతుబంధు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రాజన్న రాజ్యం రావాలని రాజశేఖర్ రెడ్డి నిజమైన రైతులను ఆదుకునే నాయకుడని ఆయన ఉన్నప్పుడే మాకు అన్ని విధాల రైతులకు సబ్సిడీలతో ఆదుకున్నాడని విలపించాడు.

మరో కౌలు రైతు వరి ధాన్యాన్ని చూపిస్తూ ఇంత చక్కగా తూర్పురా పట్టిన వడ్లను కూడా క్వింటాకు 10 కేజీల చొప్పున మిల్లల వారు కటింగ్ చేయడం రైతులకు ఏమాత్రం సేయస్కరం కాదని దానివల్ల తాము పూర్తిగా నష్టపోతామని తప్ప మిగిలేది ఏం లేదని అన్నారు. పలువురు మహిళ రైతులు షర్మిలతో గత నెల 15రోజుల నుండి ధాన్యాన్ని కళ్ళంలోనే కాపాడుకుంటూ ఉంటున్నామని ఇప్పటికీ నాలుగుసార్లు వర్షానికి ధాన్యాన్ని కాపాడామని అయినా ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ వారు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు.

రాజన్న బిడ్డగా పాలేరులో పోటీ చేస్తా..

ఖమ్మం రూరల్ మండలంలోని సాయి గణేష్ నగర్ లోని వైఎస్ఆర్ టీపీ పార్టీ కార్యాలయంలో మేడే కార్మిక దినోత్సవం సందర్బంగా వైఎస్ షర్మిల జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాత్రికేయులు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారని ఆమెను ప్రశ్నించగా? పాలేరు నియోజకవర్గం నుండే రాజన్న బిడ్డగా పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ టీపీ ఖమ్మం జిల్లా నాయకురాలు గడిపల్లి కవిత, షర్మిల వ్యక్తిగత సహాయకుడు నంద్యాల రవీందర్ రెడ్డి, కేవైవీ రెడ్డి , వైఎస్ఆర్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read more:

తెలంగాణ చరిత్రలో అత్యంత అవినీతిపరుడు ‘‘ట్విట్టర్‌ టిల్లు’’: బండి సంజయ్ ఫైర్

Next Story

Most Viewed