ప్రభుత్వ పాలనలో ఆర్టీఐతో పారదర్శకత

by Disha Web Desk 1 |
ప్రభుత్వ పాలనలో ఆర్టీఐతో పారదర్శకత
X

సమాచార హక్కు కమిషనర్‌ శంకర్‌నాయక్‌

దిశ, కారేపల్లి: ప్రభుత్వ పాలకులు, అధికారులలో ఆర్టీఐతో పారదర్శకత పెరిగిందని సమాచార హక్కు కమిషనర్‌ గుగులోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మంగళవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆర్టీఐ పై అవగాహన సదస్సు ప్రిన్సిపాల్‌ మీటకోటి సింహాచలం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో ఆర్టీఐ కమీషనర్‌ మాట్లాడుతూ ఆర్టీఐతో కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కావల్సిన సమాచారం కోసం ఆర్టీఐ దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమాచారం ఇవ్వకుండా కావాలని జాప్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

ఆర్టీఐలోని వివిధ సెక్షన్లపై విద్యార్థులకు వివరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఎదుట సమాచార ఇవ్వాల్సిన అధికారుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు తప్పని సరిగా ఉంచాలన్నారు. అనంతరం కమీషనర్‌ శంకర్‌నాయక్‌ను ప్రిన్సిపాల్‌ సింహాచలం సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ తూమటి శ్రీనివాస్‌, కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు, ఎంపీవో రామారావు, ఆర్‌ఐ నర్సింహరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం కోఆర్డినేటర్‌ దుర్గాప్రసాద్‌, మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed