పదవిని ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగిస్తా

by Disha Web Desk 15 |
పదవిని ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగిస్తా
X

దిశ, కారేపల్లి : పదవిని ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగిస్తా తప్ప పైరవీలకు తావివ్వనని సీఎం రేవంత్‌రెడ్డి పీఆర్వో దూదిపాళ్ల విజయ్‌కుమార్‌ అన్నారు. కారేపల్లి మండలం కమలాపురంనకు చెందిన దూదిపాళ్ల విజయ్‌కుమార్‌ సీఎం పీఆర్వోగా నియమితులై తొలిసారిగా కారేపల్లి మండలానికి వచ్చిన సందర్భంగా ఆయన్ని కారేపల్లి ప్రెస్‌ క్లబ్‌, కమలాపురం యూత్‌ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో దూదిపాళ్ల విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గురువులు వేసిన పునాధులే తనను ఇంత స్ధాయికి తీసుకొచ్చారని, అప్పటి గురువులను గుర్తుచేసుకున్నారు.

సింగరేణి కాలరీస్‌, మాధారం డోలమైట్‌ మైన్స్‌ ద్వారా మండలానికి రావల్సిన సీఎస్‌ఆర్‌ నిధులపై ఆ సంస్ధల అధికారులతో చర్చించి నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఇప్పటికే సీఎస్‌ఆర్‌ నిధుల విషయమై సింగరేణి సీఎండీ బలరాంతో మాట్లాడినట్లు తెలిపారు. పార్టీలు ఏదైనా ప్రజా సమస్యలపై వచ్చిన వారికి తన వంతు సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అంతకు మందు ఎంపీపీ మాలోత్‌ శకుంతల, జెడ్పీటీసీ వాంకుడోత్‌ జగన్‌లు మాట్లాడుతూ మండలంలో సాగునీరు, రహదారుల సమస్యలను వివరించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సామినేని రాఘవులు, పర్సా ట్రస్ట్‌ చైర్మన్‌ డాక్టర్‌ పర్సా పట్టాభి రామారావు, న్యాయవాది నర్సింగ్‌ శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలని కోరారు. మండల వాసి పీఆర్వో కావటం అభినందనీయమన్నారు.

సన్మానించిన కమలాపురం యూత్‌

కమలాపురంనకు చెందిన దూదిపాళ్ల విజయ్‌కుమార్‌ను ఆగ్రామ యువకులు, వివిధ రంగాలలో స్ధిరపడిన వారు సన్మానించారు. విజయ్‌కుమార్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు దూదిపాళ్ల భాస్కర్‌రావు-కళావతి లను సన్మానించారు. గ్రామంలో యువకులకు విజయ్‌కుమార్‌ స్పూర్తి అని వారు తెలిపారు. విద్యార్థిగా ఉన్న దశ నుండి గ్రామంలోని తోటి వారిని ప్రోత్సహించి ఉన్నత స్థితికి వెళ్లటానికి అనేక విధాలుగా సాయం అందించిన మార్గదర్శి దూదిపాళ్ల అని ఆ గ్రామ యువకులు కొనియారు. వీ కేర్‌ స్వచ్చంద సంస్ధ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి చేస్తున్న కృషిలో విజయ్‌కుమార్‌ పాత్ర మరవలేనిదన్నారు. ఈ సందర్భంగా ఆదెర్ల శంకర్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు ఇమ్మడి రమాదేవి, పెద్దబోయిన ఉమాశంకర్‌, విద్యావేత్తలు ఎండీ.బాబు,

చెవుల వెంకటేశ్వర్లు, ఎన్‌ఆర్‌ఐ అసోసియేషన్‌ నాయకులు నూతలపాటి వెంకటేశ్వర్లు, తోటకూరి పిచ్చయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు తలారి చంద్రప్రకాశ్‌, టీపీసీసీ మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల, నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీరప్రతాఫ్‌(టోనీ), గుగులోత్‌ భీముడు, బోడా సెట్‌రాం, వడ్డె అనంతయ్య, గుత్తా గంగయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గమిడి నర్సింహరావు, బీఆర్‌ఎస్‌ నాయకులు జడల వెంకటేశ్వర్లు, డొంకెన రవీందర్‌, ఎస్‌కె.గౌసుద్దీన్‌, ఆదెర్ల రామారావు, టీడీపీ నాయకులు పోలూరి రామారావు, యాకుబ్‌పాషా, బోడా మంగీలాల్‌, బీజేపీ నాయకులు కల్తి రాంప్రసాద్‌, తురక నారాయణ, కమలాపురం యూత్‌ సభ్యులు మల్లెల కోటి, రేపాల సతీష్‌, వడ్డె ఉదయ్‌, వడ్డె సంపత్‌, శాగంటి లక్ష్మినారాయణ, శాగంటి కిరణ్‌, ప్రెస్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షులు అనంతారపు వెంకటాచారి, ప్రధానకార్యదర్శి పగడాల నాగేశ్వరరావు, కోశాధికారి పాలిక శ్రీనివాస్‌, సహాయకార్యదర్శి తేళ్ల శ్రీనివాసరావు, కే.వెంకటేశ్వర్లు, కొత్తూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Next Story