సంపదను సృష్టించి ప్రజలకు పెంచడమే ప్రజాప్రభుత్వం లక్ష్యం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి

by Disha Web Desk 20 |
సంపదను సృష్టించి ప్రజలకు పెంచడమే ప్రజాప్రభుత్వం లక్ష్యం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి
X

దిశ, ఖమ్మం : సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ప్రజాప్రభుత్వం ప్రధానమైన ఎజెండా, ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లా వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం నుంచి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముగ్గురు మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, వంద రోజుల్లో మిగతా నాలుగు గ్యారంటీలు అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంలో ప్రతివ్యవస్థ ప్రతిసంస్థ ప్రజల కోసం పనిచేస్తుందని, ఈ పీపుల్స్ ప్రభుత్వాన్ని పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తామన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రాద్రి శ్రీ రామచంద్రుడి ఆశీస్సులతో మరోసారి ప్రజలకు సేవచేసే అవకాశం వచ్చిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వల్ల మరో ఐదు ఏళ్ల జీవితం పెరిగిందన్నారు. జిల్లాలో సమర్థ మంత్రి వల్ల అధికారులు తప్పులు చేశారని వాటిని సరిదిద్దు కోవాలన్నారు. భూ కబ్జాల పై నిఘా పెట్టి వాటి వెనుక ఉన్నవారిని గుర్తించాలన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అప్పుడే ఏముంది.. ముందు ఉంది ముసళ్ళ పండుగ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం పందికొక్కులా నువ్వు.. నీ మామ అకౌంట్ లోకి వేసుకున్నారని దుయ్యబట్టారు. 9 ఏళ్లలో అప్పుల కుప్పగా మార్చి, మేము అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మా మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ కార్డును అమలు చేస్తామన్నారు.

Next Story

Most Viewed