సీతమ్మ తల్లే గొప్పది...కాదు మా రామయ్యే...

by Disha Web Desk 15 |
సీతమ్మ తల్లే గొప్పది...కాదు మా రామయ్యే...
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో నిత్య విధి అనంతరం రాత్రి శ్రీరామ చంద్ర మూర్తిని గరుడ వాహనదారునిగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయుద్యాలు, వేద మంత్రాలు, భక్తుల జయ జయ ద్వానాల నడుమ ప్రధాన ఆలయం నుండి ముక్కోటి వైకుంఠ ద్వారం వద్దకు తీసుకుని వచ్చి సీతారాములను ఎదురుదురుగా

వేంచేపు చేసి ఎదుర్కోలు సన్నాహము ప్రారంభించారు. స్వామి వారి తరపున ఒకరు, అమ్మ వారి తరపున ఒకరు అర్చక స్వాములు సీతారాముల వైభవాన్ని సంభాషణ రూపంగా మనోరంజకంగా నిర్వహించారు. సీతమ్మ తల్లి గొప్పదని ఒకరు ప్రస్తావించగా... కాదు కాదు మా రామయ్య తండ్రే గొప్పవాడు అంటూ రామాయణంలోని పలు ఘట్టాలు ప్రస్తావిస్తూ సాగిన ఈ సంభాషణ భక్తులను ఆకట్టుకుంది. అనంతరం ఎదుర్కోలు నిర్వహించి స్వామి వారికి పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు సమర్పించారు.


Next Story