khammam Munneru River :ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం.. సహాయక చర్యల్లో పోలీస్‌లు

by Disha Web Desk 12 |
khammam Munneru River :ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం.. సహాయక చర్యల్లో పోలీస్‌లు
X

దిశ ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వాగు సామార్ధ్యం కంటే అత్యధికంగా వరద పెరిగి ప్రస్తుతం 28 అడుగులు ఎత్తుకు చేరుకోవడంతో పరివాహక ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. మున్నేరు‌లో చేరిన వరద నీరుతో మూడవ పట్టణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇండ్లు మునిగిపోవడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా మంత్రి ఆదేశాల మేరకు కదిలిన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి పునరావస కేంద్రాలకు తరలించే పనిలో పడ్డారు . ఇప్పటికే ఖమ్మం కాలవొడ్డు ప్రాంతంలో మోతే నగర్, మంచి కంటి నగర్, వాసవి నగర్, పంపింగ్ వెల్ రోడ్డు పెద్దమ్మ గుడి, బురద రాగాపురం, ఇండియన్ గ్యాస్ గోడౌన్ ప్రాంతంలే కాక సుందరయ్య నగర్, ధంసలాపురం, శ్రీనివాస్ నగర్, ప్రాంతాల్లో నీటి మునిగిన ఇండ్లను సైతం అధికారులు పరిశీలించారు.

మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో నగరంలో లోతట్టు ప్రాంతాలను డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వరి, పోలీస్ ఏసీపీలో గణేష్, ప్రసన్న కుమారుల పర్యవేక్షణలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్, మహబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా తలిపేరు ప్రాజెక్టు వల్ల మొన్నేటి వాగురుకు వరద ఉధృతి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున మున్నేరు ప్రవహిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించుకున్న ప్రజలు ఈ వరదల్లో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. దీంతో వ్యాపారుల వల్ల నష్టపోయిన బాధితులు ఎక్కడ విరుచుకుపడతారో అన్న ఆందోళన‌లో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాగుకు ఆనుకొని ఉన్న దేవాలయాలు, స్మశానవాటిక తో సహా మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా సుందరయ్య నగర్ , పంపింగ్ వెల్ రోడ్డు పెద్దమ్మతల్లి గుడి దగ్గర్లో వేసిన వెంచర్లు నీట మునిగిపోయాయి. వరద ప్రాంతాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు.

Also Read :

Khammam Floods : ఖమ్మంలో అంతా అస్తవ్యస్తం.. ఫొటో ఫీచర్

Jammikunta : జమ్మికుంటలో నీట మునిగిన ఇండ్లు.. భారీగా ఆస్తి నష్టం



Next Story

Most Viewed