డోర్నకల్‌లో ఊహించని ఘటన... వెళ్తున్న క్రమంలో సడెన్‌గా...

by Disha Web |
డోర్నకల్‌లో ఊహించని ఘటన... వెళ్తున్న క్రమంలో సడెన్‌గా...
X

దిశ, డోర్నకల్: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన డోర్నకల్ లో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ వివరాల ప్రకారం.. డోర్నకల్ పట్టణానికి చెందిన కాలా వినోద్ కుమార్ జైన్(52) డోర్నకల్ రైల్వే జంక్షన్ ప్లాట్ పారం చివరలో ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టింది. దీంతో వినోద్ కుమార్ కడుపులో బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Next Story