దశాబ్దాల కలకు శ్రీకారం.. దశాబ్ది వేడుకగా సాకారం

by Disha Web Desk 15 |
దశాబ్దాల కలకు శ్రీకారం.. దశాబ్ది వేడుకగా సాకారం
X

దిశ, అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల తొలి రోజు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. రూ. 23 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శుక్రవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. స్థానిక రింగ్ రోడ్డు మీదుగా జంగారెడ్డిగూడెం - సత్తుపల్లి వైపుగా రూ.9 కోట్లతో రెండు కిలోమీటర్లు, పోలీస్ స్టేషన్ సెంటర్ నుండి భద్రాచలం రోడ్డు వైపు రూ.11 కోట్ల 75 లక్షల వ్యయంతో ఒకటిన్నర కిలోమీటర్లు మేర రోడ్లను విస్తరించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ ను ఏర్పాటు చేయనున్నారు.

2009లో అశ్వారావుపేట నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుండి స్థానిక వాసులు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కానీ ఎంతకీ కార్యరూపం దాల్చడం లేదు. సెంట్రల్ లైటింగ్ రోడ్డు విస్తరణ పనులపై స్థానికుల్లో ఆశలు ఆవిరవుతున్న వేళ.. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ ను ఒప్పించి అనుమతులు తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించారు. ఎన్నో అవరోధాలను దాటుకొని దశాబ్దపు స్థానికుల ఆకాంక్షను దశాబ్ది ఉత్సవాల తొలి రోజు శంకుస్థాపన చేసి ప్రారంభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed