21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు : ఎమ్మెల్యే హరిప్రియ

by Disha Web Desk 15 |
21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు : ఎమ్మెల్యే హరిప్రియ
X

దిశ,ఇల్లందు : జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ కోరారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 21 రోజులపాటు పండగలా నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ప్రజలను భాగ్య స్వాములను చేయాలని కోరారు. రాష్ట్ర అవతరణ జరిగి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. అభివృద్ధిని వివరించాలన్నారు.

అభివృద్ధిపై గ్రామాల్లో దండోరాలు వేసి ఉత్సవాలను నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాథ్, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, పరుచూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు, వార్డు కౌన్సిలర్ వార రవ, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి, సోషల్ మీడియా ఇంచార్జ్ గిన్నారపు రాజేష్, నాయకులు డేరంగుల పోశం, రాఘవరపు రాకేష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed