కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట..

by Disha Web Desk 20 |
కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట..
X

దిశ, వైరా : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం వైరాలో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. చివరకు కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మధిర క్రాస్ రోడ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా వైరా ఎస్సై తో పాటు కానిస్టేబుల్ అడ్డుకున్నారు.

దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం వెంకటనర్సిరెడ్డి,దాసరి దానియేలు, నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Next Story

Most Viewed