రైలు నుంచి కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Disha Web Desk 15 |
రైలు నుంచి కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, మధిర : గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి కింద పడి మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారు జామున ఎర్రుపాలెం - గంగినేని రైల్వే స్టేషన్ల మధ్యన జరిగింది. మృతుని వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని మధిర జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. మృతుడు శుక్రవారం సాయంత్రం నుండి రైల్వే గేటు, రైల్వే స్టేషన్ సమీపంలో పిచ్చిపిచ్చిగా అరుస్తూ తెలుగు , తమిళ భాషల్లో మాట్లాడుతూ తిరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుడు తెలుపు, నీలం నలుపు గల చొక్కా నీలము, తెలుపు గళ్ల లుంగి ధరించి ఉన్నాడు. ఈ కేసును ఖమ్మం జీఆర్పీ ఎస్ఐ భాస్కర రావు కేసు నమోదు చేయగా, మధిర జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి శవాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుని వివరాలు తెలిసిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్లు 9963641484, 8712658607 సంప్రదించాలని పోలీసులు కోరారు.

Read Disha E-paper

Next Story

Most Viewed