ఏజెన్సీ యాక్ట్‌ ఖూనీ.. పినపాక మండలంలో వెలసిన బహుళ అంతస్థు భవనం..!

by Disha Web Desk 19 |
ఏజెన్సీ యాక్ట్‌ ఖూనీ.. పినపాక మండలంలో వెలసిన బహుళ అంతస్థు భవనం..!
X

దిశ,మణుగూరు/పినపాక: ఓ మహిళ ఏజెన్సీ యాక్ట్‌ను నిర్వీర్యం చేసి దర్జాగా బహుళ అంతస్థు భవనాన్ని నిర్మించిన పంచాయితీ అధికారులు చోద్యం చూస్తున్నారు. గిరిజన చట్టాలకు అధికారులే వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఈ బహుళ అంతస్థు నిర్మాణం ద్వారా తేటతెల్లమౌతోంది. ఈ వ్యవహారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో కనిపిస్తోంది. బయ్యారం క్రాస్ రోడ్డులో ఓ మహిళ అక్రమంగా బహుళ అంతస్థు భవనాన్ని నిర్మించి ఆ భవనంలో కొన్ని గదులను అద్దెకు ఇస్తూ నెలకు లక్షల రూపాయలు వసూళ్లు చేస్తుందని గిరిజనులు వాపోతున్నారు. అంతేగాక ఆ భవనం ముందు చిరు వ్యాపారాలు వ్యాపారం చేసుకుంటే రోజుకి 500 నుంచి 1000 రుపాయలకు చెల్లించాలని డిమాండ్ చేస్తుందనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.

అసలు ఏజెన్సీలో బహుళ అంతస్థు భవనాలకు అనుమతులు లేవు.. కానీ 1/70 యాక్ట్ ఖూనీ చేసి భారీ బహుళ అంతస్థు భవనాన్ని నిర్మించి వేల రుపాయలకు అద్దెకు ఇస్తోంది. ఈమె నిర్మించిన అక్రమ బహుళ అంస్థుల నిర్మాణంలో పంచాయితీ అధికారుల చేతివాటం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల చేతివాటం లేకపోతే బహుళ అంతస్థు భవనం ఎలా నిర్మించిదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈమె ఇలా ఏజెన్సీ చట్టాన్ని గుప్పెట్లో పెట్టుకొని నెలకు వేల రూపాయలు సంపాదిస్తోందని గిరిజనులు మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే "నీ అంతు చూస్తా.. ఏమనుకుంటున్నావ్" అంటు బెదిరిస్తోందని పలువురు వాపోతున్నారు. నిర్మించిన అక్రమ బహుళ అంతస్థు భవనాన్ని అధికారులు కూల్చుతారా.. కూల్చారా..! అని గిరిజనులు నిలదీయడం సంచలనంగా మారింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్థు భవనాన్ని కూల్చివేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.



Next Story

Most Viewed