తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

by Disha Web Desk 2 |
తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పోడు భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జోవో 140 చట్ట పరిధిలో లేదని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయ పడింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేయాలని న్యాయస్థానం పేర్కొంది. పోడు భుములపై ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 140ని సవాల్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేజావత్ శంకర్ సహా ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన పిటిషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో చట్ట పరిధిలో లేదని పిటిషనర్లు తెలిపారు. పోడు భూములపై హక్కులను ధృవీకరించేందుకు ఏర్పాటు చేసిన జీవోలో ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో కమిటీ ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కమిటీల్లో రాజకీయ పార్టీల నాయకులకు స్థానం కల్పించడం రాజ్యంగ విరుద్దని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140 చట్ట పరిధిలో లేదని అభిప్రాయపడింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కమిటీ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించింది. అనంతరం విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది.



Next Story

Most Viewed